ట్రాన్స్ జెండర్ల దందా..భిక్షాటన ముసుగులో డబ్బుల వసూళ్లు

ట్రాన్స్ జెండర్ల దందా..భిక్షాటన ముసుగులో డబ్బుల వసూళ్లు
  •     ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు
  •     19 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

సికింద్రాబాద్​, వెలుగు : ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్ల వేషం వేసి.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న 19 మందిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సికింద్రాబాద్​లోని నార్త్ జోన్ డీసీపీ ఆఫీసులో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు.  అరెస్టు అయిన వారిలో ఇద్దరు మాత్రమే ట్రాన్స్ జెండర్లు అని మిగతా వారంతా మగవాళ్లేనని, వీరంతా భిక్షాటన ముసుగులో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు డీసీపీ తెలిపారు.  

ఇందులో రాజేశ్ యాదవ్, అనిత అనే ఇద్దరు గ్యాంగ్ లీడర్లుగా వ్యవహరిస్తూ.. మిగతా వారితో బెగ్గింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు.  వీరంతా బిహార్, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి వచ్చి ఈజీ మనీ కోసం భిక్షాటన చేస్తూ దందాలకు పాల్పడుతున్నట్లు ఆమె వెల్లడించారు. వీరు బెగ్గింగ్ ​ముసుగులో గంజాయి, డ్రగ్స్ దందాల​కు పాల్పడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

వివిధ పీఎస్​ల పరిధిలో పోలీసులకు పట్టుబడ్డ ఫేక్​ ట్రాన్స్​జెండర్లు వీరే.. 

రాంగోపాల్​పేట పీఎస్ పరిధిలో : సికింద్రాబాద్ వెంగళరావు నగర్​కు చెందిన అనిత (45), గణేశ్ అలియాస్ గాయత్రి (18)  భూక్యా అఖిల్​అలియాస్​ అహల్య(19),  పేరం వీరన్న (32),  బాలంరాయిలో ఉండే పెద్దపల్లి నిరంజన్​ అలియాస్​ యమున(33), మల్కాజిగిరిలో ఉండే జాతోత్​ సంజయ్​ అలియాస్​ సంజన(20), లకావత్​ ప్రశాంత్​ అలియాస్​ ప్రసన్న (21).

మహంకాళి పీఎస్ పరిధిలో : జగద్గిరిగుట్టకు చెందిన సనాఖాన్​(24), సూరారంలో ఉండే  సుధీర్ ​అలియాస్​ శ్రుతి,  వినుకొండ ఇమ్మాన్యుయేల్​ అలియాస్​ చంద్రిక(27), బాలానగర్​లో ఉండే ప్రమోద్ కాంబ్లే అలియాస్​ సైరాబాను(32).

మారేడ్​పల్లి పీఎస్ పరిధిలో : సూరారంలో ఉండే బిహార్​కు చెందిన రాజేశ్​ యాదవ్​ అలియాస్​ ప్రీతి కుమారి(22), పవన్​కుమార్​ అలియాస్ బబ్లీ(19), మంజయ్​కుమార్​ అలియాస్​ రాణి(27), కృష్ణ అలియాస్​ ముస్కాన్‌‌ (20).

గోపాలపురం పీఎస్ పరిధిలో : మల్లాపూర్‌‌‌‌లో ఉండే  నేత్ర (39),  రమేశ్‌‌ అలియాస్​ శేఖర్​(32), బుదావత్​ నితిన్ అలియాస్​ నిత్య(22).మొత్తం 19 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 9 సెల్​ఫోన్లు, రూ.12 వేల 260 క్యాష్​ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చందనా దీప్తి తెలిపారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.