ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాళాలు, పార్కుల పరిరక్షణే ధ్వేయంగా ఏర్పడిన హైడ్రా.. కొందరు ట్రాన్స్ జెండర్ల జీవితంలో వెలుగులు నింపుతోంది. కొలువు తెచ్చిన గౌరవంతో ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటూ పోతున్నారు. సమాజం నుంచి ఈసడింపులు, అవమానాల నుంచి బయటపడి.. గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నట్లు ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు.
హైడ్రా ఈగల్ టీమ్ గా ట్రాన్స్ జెండర్ల బృందం ప్రత్యేక గుర్తింపు పొందింది. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రాలో అవకాశం కల్పించారు. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, 5 మంది ట్రాన్స్ మెన్ లు ఉన్నారు.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ట్రాన్స్జెండర్ల టీమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆక్రమణల తొలగింపులో వెనుకడుగు వేయకుండా విధులు నిర్వహిస్తోంది ఈగల్ టీమ్. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణలో కీలక పాత్ర వీళ్లు కీలక పాత్ర పోషించారు.
మాదాపూర్ ఈదులకుంట పరిరక్షణ చర్యల్లోనూ సేవలను అధికారులు మెచ్చుకున్నారు. సహనం, భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణంతో ఫీల్డ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని హైడ్రా అధికారుల ప్రశంసించారు.
హైడ్రా ఉద్యోగాలతో ట్రాన్స్జెండర్లు తమ కుటుంబాలకు ఆర్థిక అండగా మారారు. సమాజంలో గౌరవం పెరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా పనికొచ్చే వాళ్లమే అన్న నమ్మకం బలపడిందంటున్నారు.
