ఆ దేశాన్ని మర్చిపోండి : మాల్దీవ్స్ కు టికెట్ బుకింగ్స్ అన్నీ రద్దు

ఆ దేశాన్ని మర్చిపోండి : మాల్దీవ్స్ కు టికెట్ బుకింగ్స్ అన్నీ రద్దు

ఇండియా అపరిశుభ్రంగా ఉంటుందంటూ అవమానించిన మాల్దీవులకు ఇండియన్స్ షాకిస్తున్నారు. తాజాగా భారత ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ అనే కంపెనీ మాల్దీవులకు ప్లైట్స్ బుక్సింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో నిశాంత్ పిట్టి  తెలిపారు. మన దేశానికి మద్దతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

మనదేశంలోని అన్ని ఆన్‌లైన్ ప్రయాణ బుకింగ్‌లలో ఈజ్ మై ట్రిప్ 8.1% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక ఇప్పటికే మాల్దీవులకు  టికెట్స్ బుక్ చేసుకున్నవారు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.  ఇప్పటికే చాలా మంది మాల్దీవ్స్ టూర్‌‌‌‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. బుకింగ్స్‌‌ను క్యాన్సిల్ చేసుకున్న స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నా రు. ఇప్పటి వరకు 8 వేల హోటల్ బుకింగ్స్, 2500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.  

మాల్దీవులు మంత్రులు, ఇతర నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్‌‌ (ట్విట్టర్‌‌‌‌)లో ‘బాయ్‌‌కాట్ మాల్దీవ్స్’ హ్యాష్‌‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. మాల్దీవులు టూర్‌‌‌‌కు వెళ్లొద్దని, లక్షద్వీప్‌‌ సహా మన దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. 

ఇటీవల లక్షద్వీప్​లో మోదీ పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. లక్షద్వీప్‌‌ను మోదీ ప్రమోట్ చేయడం వల్ల మాల్దీవులుపై పెద్ద దెబ్బ పడుతుందని, మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు.