ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురికి ట్రీట్ మెంట్

ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురికి ట్రీట్ మెంట్

ఆస్పత్రి ఎదుట పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆందోళన 

మెహిదీపట్నం, వెలుగు: నిలోఫర్ ఆస్పత్రిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  పీవైఎల్, పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సమస్యలపై సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్ఎంఓ లాలూ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు స్వరూప మాట్లాడారు. ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్తోందని, కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. అవసరం లేని వాటికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్.. ప్రజలకు అవసరమైన ఆస్పత్రిలో మాత్రం సౌలతులు కల్పించడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, ఆస్పత్రిలో ఉన్న బెడ్ల సంఖ్యకు తేడా ఉందన్నారు.

ఒకే బెడ్ పై ఇద్దరు, ముగ్గురికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారన్నారు. ఆస్పత్రిలో మరిన్ని బ్లాకులు నిర్మించి, బెడ్స్ సంఖ్యను పెంచాలని.. జనరల్ వార్డులో రెండు ఓపీ సెక్షన్లు ఏర్పాటు చేసి, ఇద్దరు డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఫార్మసీ 24 గంటలు ఓపెన్ చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, సరిపడా డాక్టర్లు, స్కావెంజర్లను నియమించాలని కోరారు.