ఎంజాయి అంటూ వెళ్లారు... పోలీసులు తిక్క కుదిర్చారు

ఎంజాయి అంటూ వెళ్లారు... పోలీసులు తిక్క కుదిర్చారు

 కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యాటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు  దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. 

గోవా కర్ణాటక బార్డర్‌లోని దూద్‌సాగర్ ఫాల్స్ వద్ద ట్రెకింగ్ ఓ స్పెషల్ అట్రాక్షన్. ఎప్పుడూ ఈ ఏరియా టూరిస్ట్‌లతో సందడిగా ఉంటుంది. అయితే...ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయాలని వచ్చిన ఓ ట్రెకింగ్ బ్యాచ్‌కి షాక్ ఇచ్చారు రైల్వే పోలీసులు. ఈ దూద్‌సాగర్ వద్ద ట్రైన్ దిగి పట్టాలు దాటి ఫాల్స్ దగ్గరికి రావడం చట్టరీత్యా నేరం. అందుకు అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వరు. అయినా...ఓ బ్యాచ్‌ దిగాల్సిన స్టేషన్‌ కన్నా ముందే దిగి రైల్వే ట్రాక్‌లు దాటుకుని దూద్‌సాగర్ ఫాల్స్‌ వద్ద ట్రెకింగ్ చేసింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పాట్‌కి వెళ్లారు. పర్మిషన్ లేకుండా ఇలా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆ తరువాత వాళ్లకు పనిష్‌మెంట్ కూడా ఇచ్చారు. అందరితోనూ గుంజీలు తీయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షాకాలంలో ఈ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి. చాలా మంది మాన్‌సూన్‌ కోసం ఎదురు చూసి మరీ ఇక్కడికి వస్తుంటారు. బెంగళూరు, మంగళూరు, బెల్గావి, ఉత్తర కర్ణాటక, హుబ్బలి దార్వాడ్, పుణే, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున పర్యాటకులు తరలి వస్తారు. సౌత్‌ గోవాలోని కొల్లెం స్టేషన్ వద్ద రైలు దిగి అక్కడి నుంచి పట్టాలు దాటి ఇక్కడికి చేరుకుంటారు.

గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. అయితే...వర్షాకాలంలో అక్కడ ట్రెకింగ్ చేయడం ప్రమాదకరం అని గతంలోనే రైల్వే పోలీసులు హెచ్చరించారు. ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలకే ప్రమాదమని తేల్చి చెప్పారు. గోవా ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గానే ఉంది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. అయినా కొంతమందిపర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా ... పట్టించుకోవడం లేదు. దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  సెలవు రోజుల్లో  వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.  ఈ వీడియోపై నెటిజన్‌లు స్పందిస్తున్నారు. కొందరు పోలీసులకు సపోర్ట్‌గా కామెంట్స్ పెట్టారు. ట్రెకింగ్‌కి ముందు మంచి వార్మప్‌ అని కొందరు ఫన్నీగా స్పందించారు.