ఇయ్యాల్టి నుంచి 83 రైళ్లకు ట్రయల్ రన్ స్టాప్​లు

ఇయ్యాల్టి నుంచి 83 రైళ్లకు  ట్రయల్ రన్ స్టాప్​లు

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రూట్లలో నడిచే 83  రైళ్లకు వివిధ స్టేషన్లలో స్టాపేజెస్​ను ఏర్పాటు చేశారు. కొత్త స్టేషన్లలో రైళ్లకు శనివారం నుంచి హాల్టింగ్​ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ – ​-నిజాముద్దీన్ – ​-హైదరాబాద్​ఎక్స్​ప్రెస్​కు జమ్మికుంట స్టేషన్​లో  హాల్ట్​ ఇవ్వగా, చెన్నై సెంట్రల్​-– నిజాముద్దీన్​-– చెన్నై సెంట్రల్ ఎక్స్​ప్రెస్​  శనివారం నుంచి వరంగల్​లో ఆగుతుంది. చెన్నై సెంట్రల్​-– అహ్మదాబాద్​– -చెన్నై సెంట్రల్​, సికింద్రాబాద్​– -రాయ్​పూర్​, సికింద్రాబాద్​– -హిస్సార్​, హైదరాబాద్​-రక్సెల్ ఎక్స్​ప్రెస్​లకు పెద్దపల్లిలో  స్టాపేజ్​ఇచ్చారు. సికింద్రాబాద్​-– బీదర్​ఎక్స్​ప్రెస్​ రైలు మర్పల్లిలో ఆగుతుంది.  సీఎస్​టీ ముంబై- – హైదరాబాద్ ఎక్స్​ప్రెస్ సీరమ్​ స్టేషన్​లో,  నిజాముద్దీన్– ​-తిరుపతి , హైదరాబాద్​– నిజాముద్దీన్, సికింద్రాబాద్– -రాయ్​పూర్, సికింద్రాబాద్​– -గోరఖ్​పూర్ ఎక్స్​ప్రెస్ కు బెల్లంపల్లిలో,

ఎర్నాకులం-– పాటలీపుత్ర  రైలు సిర్పూర్ కాగజ్​నగర్​స్టేషన్​లో, భద్రాచలం- – సిర్పూర్​ టౌన్​రైలు ఆసిఫాబాద్​స్టేషన్​లో, తాంబరం – -హైదరాబాద్​ రైలు డోర్నకల్​లో ,సికింద్రాబాద్​ – -మణుగూరు ట్రైన్​కారేపల్లిలో, తిరుపతి – -సికింద్రాబాద్​,విశాఖపట్నం– -కాచిగూడ  రైలు మధిర స్టేషన్​లో, నిజాముద్దీన్​– -తిరుపతి రైలు మంచిర్యాల స్టేషనలో,  తిరుపతి – -నిజాముద్దీన్​ రైలు నవాంద్గి స్టేషన్​లో, కేఎస్ఆర్​ బెంగళూరు – -పాట్నా ,హైదరాబాద్​– -నిజాముద్దీన్​, రామేశ్వరం-– మండువడి, మైసూర్ – ​-దర్బంగా, ఎర్నాకులం – -పాట్నా రైళ్లు రామగుండం స్టేషన్​లో, ఎర్నాకులం – -పాట్నా  రైలు ఖమ్మంలో, ఎర్నాకులం-–  పాట్నా రైలు మంచిర్యాల స్టేషన్​లో,

గుంటూరు – -రాయ్ గడ రైలు భీమడోలులో, పూరి – -తిరుపతి  చిన్న గంజాంలో, విజయవాడ – -కాకినాడ పోర్ట్​ రైలు పసివేదల, గుంటూరు– -నర్సాపూర్​ రైలు పుట్లచెరువు స్టేషన్​లో, విజయవాడ– -మచిలీపట్నం రైలు ఉప్పులూరులో, ఎర్నాకులం- – బరౌనీ రైలు చీరాలలో, బిలాస్​పూర్​–- తిరుపతి  రైలు చిన్న గంజాం​లో, శ్రీమాతా వైష్ణోవ్​దేవి -కన్యాకుమారి ఎక్స్​ప్రెస్​గుంటూరు స్టేషనలో ఆగుతుందని రైల్వే అధికారులు వివరించారు.  ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ హాల్టింగ్​లు ప్రయాణికుల నుంచి వచ్చే  స్పందనను బట్టి కొనసాగించనున్నట్లు తెలిపారు.