
కాంగ్రెస్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సద్భావన సంకల్పయాత్ర తెలంగాణలో ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సాగిన యాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సరిహద్దు వరకు పాదయాత్ర చేశారు. పేదలందరూ సుఖంగా ఉండాలని గతంలో కాంగ్రెస్ భూములు పంచితే, ప్రస్తుత TRS ప్రభుత్వం వాటిని లాక్కుంటోందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే సీతక్క. కేసీఆర్ పాలన పూర్తిగా భూస్వామ్య, రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఆరోపించారు. పోడు భూములకు వెంటనే గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.