త్రిబాణధారి అసలు అర్థాన్ని చెప్పేలా ‘త్రిబాణధారి బార్బరిక్’

త్రిబాణధారి అసలు అర్థాన్ని చెప్పేలా ‘త్రిబాణధారి బార్బరిక్’

సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహా ప్రధాన పాత్రల్లో మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక కొత్త రకమైన కథ. చాలా థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. బార్బరికుడి మూడు బాణాల్లోని అసలు అర్థాన్ని చెప్పేలా, మంచి మెసేజ్ ఇచ్చేలా తెరకెక్కించాం.  సత్య రాజ్ ఇప్పటివరకు  పోషించనటువంటి పాత్రను  చేశారు.

ఇందులోని ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. దర్శకుడు మారుతి చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నమ్మకంతో  వరంగల్, విజయవాడలో ప్రీమియర్లు వేశాం. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి ఈ మూవీని తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన భాషల్లో త్వరలోనే డబ్ చేస్తాం. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయడంతో కావాల్సినన్ని థియేటర్స్ లభించాయి. ఇక దీంతోపాటు ‘బ్యూటీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా’ అని చెప్పారు.