
న్యూఢిల్లీ: అనారోగ్యంతో కన్నుమూసిన ఇండియా మాజీ క్రికెటర్, కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌కు క్రికెట్ లోకం ఘన నివాళులు అర్పించింది. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న 72 ఏండ్ల అన్షుమన్ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని మోదీ, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, కోచ్ గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్ తదితరులు సంతాపం తెలిపారు. దేశ క్రికెట్‌కు ఆయన ఎనలేని కృషి చేశారని మోదీ అన్నారు. క్రికెట్ కమ్యూనిటీ గైక్వాడ్‌ను మిస్ అవుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు.