రూ. 2,546 కోట్లతో ట్రైకార్ యాన్యువల్ ప్లాన్

రూ. 2,546 కోట్లతో ట్రైకార్ యాన్యువల్ ప్లాన్

హైదరాబాద్, వెలుగు: మసాబ్ ట్యాంక్​లోని డీఎస్ఎస్ భవన్​లో ట్రైకార్ (తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ) చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ అధ్యక్షతన జరిగిన 11వ బోర్డు సమావేశంలో 2026–-27 వార్షిక ప్రణాళికకు ఆమోదం తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా రూ. 2,085 కోట్ల సబ్సిడీ, రూ. 461.24 కోట్ల బ్యాంక్ రుణాలతో సుమారు 1,36,184 మంది గిరిజన యువతకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించారు. 

రాజీవ్ యువ వికాసం, రూరల్ ట్రాన్స్​పోర్ట్, గిరిజన రైతులకు యాంత్రీకరణ, ఇందిరా సౌర గిరి జల వికాసం వంటి వినూత్న పథకాల అమలుపై చర్చించిన ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ, డైరెక్టర్ బి.ఎం. సంతోష్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.