నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రి

నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రి

‘యానిమల్’ సినిమాతో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్టార్‌‌‌‌‌‌‌‌గా మారిన త్రిప్తి డిమ్రి.. బాలీవుడ్‌‌‌‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రీసెంట్‌‌‌‌గా ‘ఓ రోమియో’ చిత్రంతో ఆకట్టుకుంది. ఇక ‘యానిమల్‌‌‌‌’తో ఆమెకు స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌ను ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌‌‌‌తో తీస్తున్న ‘స్పిరిట్‌‌‌‌’ చిత్రంలోనూ ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు.  ఇటీవల విడుదలైన ప్రభాస్‌‌‌‌, త్రిప్తి ఫస్ట్ లుక్‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. 

ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇది సెట్స్‌‌‌‌పై ఉండగానే మరో తెలుగు సినిమా హీరోకి జంటగా ఆమె నటించే అవకాశం అందుకుంది.  నాని హీరోగా సుజీత్‌‌‌‌ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌‌‌‌ పాత్ర కోసం పూజాహెగ్డే, రుక్మిణీ వసంత్ పేర్లు ఇటీవల ప్రచారంలోకి రాగా, త్రిప్తిని ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం. 

‘యానిమల్’ తరహాలోనే ఇందులోనూ ఆమె బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేయబోతోందని తెలుస్తోంది. అలాగే నిన్నటితరం బాలీవుడ్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ మాధురి దీక్షిత్‌‌‌‌ను మరో కీలకపాత్రకు ఒప్పించినట్టుగా ప్రచారంలో ఉంది.  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ లేదా జులై నుంచి సెట్స్‌‌‌‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.