40 ఏళ్ల వయసులో పెళ్లిపై మనసు పారేసుకున్న త్రిష!

40 ఏళ్ల వయసులో పెళ్లిపై మనసు పారేసుకున్న త్రిష!

40ఏళ్ల వయసులో పెళ్లిపై స్టార్ హీరోయిన్ త్రిష మనసు పారేసుకుందట..  త్వరలో త్రిష పెళ్లంటూ మరోసారి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   ప్రముఖ మలయాళ నిర్మాతను త్రిష వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటిస్తారట.

 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. ఆ తరువాత పలుమార్లు  త్రిష పెళ్లి గురించి వార్తలు వచ్చాయి కానీ అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.  

తాజాగా మళ్లీ త్రిష పెళ్లిపై వార్తలు తెరపైకి వచ్చాయి.  40ఏళ్ల వయసులో కూడా ఎక్కడా కూడా స్టార్డమ్ తగ్గకుండా సినిమాలు చేస్తోంది త్రిష.  మరోవైపు ఆమె అభిమానులు కూడా త్రిష పెళ్లి గురించి అసక్తిగా ఎదురుచూస్తున్నారు.  15 ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన త్రిష...  ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళంలో మూడు మూవీస్ చేస్తుంది.