సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మ్యాచ్లో హైలైట్ క్యాచ్

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మ్యాచ్లో  హైలైట్  క్యాచ్

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టీ20మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది.  ఏకంగా 90 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20  సిరీస్‌ను 2-1తో  దక్షిణాఫ్రికా దక్కించుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ టీమ్...20 ఓవర్లలో 5వికెట్లకు 191పరుగులు చేసింది.  విల్లీ  3వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత 192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్..16.4 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. తబ్రైజ్ షమ్సీ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ క్రీజులో నిలవలేకపోయారు. బెయిర్ స్టో ఒక్కడే 27 రన్స్ చేయగా..మిగతా వారు  20పరుగులకు మించి చేయలేదు.  తబ్రైజ్ షమ్సీ 5 వికెట్లు తీయగా..కేశవ్ మహరాజ్ 2, అన్రిచ్ నార్జ్ , పెహులుక్వయో , మార్క్రమ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. 

 ఒంటి చేత్తో క్యాచ్ హైలెట్..
ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ప్లేయర్ పట్టిన క్యాచ్ హైలెట్ గా నిలిచింది. 10వ ఓవర్లలో మార్కరమ్ బౌలింగ్ లో త్రిస్టన్ స్టబ్స్ పట్టిన క్యాచ్..అద్భుతం. మార్కరమ్ బౌలింగ్లో మొయిన్ అలీ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే  ఓవర్ లాస్ట్ బాల్ ను మొయిన్ ఆలీ స్ట్రెయిట్ గా  ఆడాడు. బంతి గాల్లోకి లేచి మిడ్ ఆఫ్ దిశగా వెళ్లింది. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న త్రిస్టన్ స్టబ్స్ బాల్ ను అందుకోవడం దాదాపు అసాధ్యం. కానీ బంతిని కరెక్ట్ గా అంచనా వేసిన స్టబ్స్ గాల్లో అద్భుతంగా డైవ్ చేసి..లెఫ్టాండ్ తో క్యాచ్ పట్టుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.

స్టబ్స్ స్టన్నింగ్ క్యాచ్తో  సౌతాఫ్రికా ప్లేయర్లు  సంబరాల్లో మునిగిపోయారు. స్టబ్స్ దగ్గరకు వచ్చి..అతన్ని అభినందించారు.