
అమెరికాలో అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ లాస్ ఏంజలెస్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. భారీ సంఖ్యలో ఆందోళకారులను అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా జరుగుతు నిరసనలను అదుపు చేసేందుకు లాస్ ఏంజిల్స్ లో 2,100 మంది నేషనల్ గార్డ్ దళ సభ్యులతోపాటు 700 మంది మెరైన్ దళ సభ్యులను ట్రంప్ మోహరించారు.
Apple store in downtown LA being looted tonight pic.twitter.com/3k5i7wKiSG
— Brendan Gutenschwager (@BGOnTheScene) June 10, 2025
అమెరికా ఓవైపు ట్రంప్ ఆదేశించిన ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనల మధ్య లాస్ ఏంజిల్స్ అట్టుడుకుతుండగా సోమవారం రాత్రి ముసుగు ధరించిన అనేక మంది వ్యక్తులు నగరంలోని ఓ ఆపిల్ దుకాణాన్ని దోచుకున్నారు.ముసుగులు ధరించిన అనేక మంది వ్యక్తులు ఆపిల్ స్టోర్‌లోకి చొరబడి గాడ్జెట్‌లను దోచుకుంటున్నట్లు కనిపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు చాలా మంది స్టోర్ నుంచి వెళ్లిపోయారు.
LAPD riot police tackle looters to the ground in downtown LA 🔥pic.twitter.com/U29C4dk3Y3
— Julia 🇺🇸 (@Jules31415) June 10, 2025