ఆరేండ్లలో 39 వేల పోస్టులే భర్తీ చేసిన సర్కారు.. ఇప్పుడు 50 వేల పోస్టులు ఎట్లా చేస్తుంది

ఆరేండ్లలో 39 వేల పోస్టులే భర్తీ చేసిన సర్కారు.. ఇప్పుడు 50 వేల పోస్టులు ఎట్లా చేస్తుంది

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మహబూబ్​నగర్​, వెలుగు: ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నో ప్రకటనలు చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించడంలో కేసీఆర్​ను మించినోడు లేడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సోమవారం బీజేపీ మహబూబ్​ నగర్​ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. 50 వేల పోస్టులను భర్తీ చేస్తానన్న సీఎం ప్రకటన నమ్మదగినది కాదని అన్నారు. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు. ఆరేండ్లలో కేవలం 39 వేల పోస్టులే భర్తీ చేసిన సర్కారు.. ఇప్పుడు 50 వేల పోస్టులను ఎట్లా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. గతంలో టీచర్​ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఐఆర్​, పీఆర్​సీ ఇస్తామంటూ హామీ ఇచ్చారని, ఓటేయకపోతే అవి రావేమోనని భయపడి టీచర్లు ఓటేశారని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా ఆ హామీలను సీఎం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. సీఎం ఆఫీసు నుంచి జాబ్స్​ లీకులు వచ్చాయని విమర్శించారు. కేసీఆర్​ మాటల గారడీలో పడి ఎవరూ మోసపోవద్దని సూచించారు. రైతుల మేలు కోసమే కేంద్రం అగ్రి చట్టాలు తెచ్చిందన్నారు.

For More News..

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం

ఫేస్​బుక్​ లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

సిజేరియన్లలో తెలంగాణ టాప్.. ఏపీ సెకండ్..