వడ్డీ కట్టలేదని దళిత యువకుడిపై దాడి చేసిన టీఆర్‌‌ఎస్‌ కార్యకర్త

వడ్డీ కట్టలేదని దళిత యువకుడిపై దాడి చేసిన టీఆర్‌‌ఎస్‌ కార్యకర్త
  • ఆత్మహత్యకు యత్నించిన యువకుడు

మున్సురాబాద్‌: మున్సురాబాద్‌లో టీఆర్‌‌ఎస్‌ కార్యకర్త రఘువీరా రెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. వడ్డీ చెల్లించలేదని దళిత యువకుడిపై దాడి చేసి, అతని ఆటోను ఎత్తుకెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మున్సురాబాద్‌లో ఉండే రఘువీరారెడ్డి‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ మేరకు ఆయన సంతోష్‌కుమార్‌‌కు వడ్డీకి డబ్బులు ఇచ్చారు. సంతోష్‌కుమార్‌‌ ప్రతినెల వడ్డీ చెల్లించేవాడు. రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా డబ్బులు కట్టడం లేదు.ఈ నేపథ్యంలో జులై 31న సంతోష్‌కుమార్‌‌ ఇంటికి వెళ్లిన రఘువీరారెడ్డి, అతడి అనుచరులు సంతోష్‌కుమార్‌‌ను బెదిరిచారు. కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా ఆటోను ఎత్తుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్‌ ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు ఎల్బీనగర్‌‌ పోలీసులకు కంప్లైంట్‌ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు.