- కారు ఫోటో తీసిండని తిట్టిండు
- కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ లీడర్ రుబాబ్
నర్సంపేట, వెలుగు: డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై గులాబీ పార్టీ లీడర్ రుబాబ్చేస్తూ నోరు పారేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లో శనివారం ఉదయం ఖలీమోద్దీన్ అనే కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నాడు. అదే సమయంలో నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి కారులో వెళ్తున్నాడు. సీటు బెల్ట్ధరించకుండా డ్రైవింగ్చేస్తుండడంతో కానిస్టేబుల్ సెల్ఫోన్లో ఫోటో తీశాడు. గమనించిన మోహన్‌రెడ్డి కారు దిగి కానిస్టేబుల్ వద్దకు వెళ్లి నా కారు ఫోటో తీస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. సీపీ ఆదేశాలు, ఆర్టీఏ రూల్స్ ప్రకారం డ్యూటీ చేస్తున్నానంటూ కానిస్టేబుల్ చెబుతున్నా ఖాతరు చేయకుండా దూకుడుగా వ్యవహరించాడు. అదే సమయంలో కొందరు రోడ్డుపై జరుగుతున్న తతంగాన్ని సెల్ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో మురాల మోహన్ రెడ్డిపై ఐపీసీ 293, 353 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ ఫణీందర్ చెప్పారు.