
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని తానెప్పుడు అనలేదన్నారు టీఆర్ఎస్ నేత కే.కేశవరావు(కేకే). ఒక వేళ మంచి జరుగుతుందనుకుంటే చర్చలు జరిపేందుకు తాను సిద్ధమన్నారు. చర్చలు జరిపేందుకు తానెవరినని అని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని కార్మికులకు సూచించానన్నారు. ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదన్నారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. ఇది పార్టీ సమస్య కాదని..ప్రభుత్వ సమస్య అని అన్నారు. కార్మికులు కొట్టుకోకుండా కలిసి కట్టుగా ఉండాలన్నారు. తాను సోషలిస్టునని.. తానెప్పుడూ కార్మికుల వైపే ఉంటానని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే తనకేం అభ్యంతరం లేదన్నారు. విలీనం సాధ్యం కాదని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.