TRS నేతలను గోవా క్యాంపుకు తరలిస్తున్నరు

TRS నేతలను గోవా క్యాంపుకు తరలిస్తున్నరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎన్నిక ఏదైనా,ఖర్చు ఎంతైనా గులాబీ జెండా ఎగరాలి, టీఆర్ఎస్ గెలిచి తీరాలన్న  గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగూడెంలో క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ. తమ పార్టీ ఓటర్లు ఇతర పార్టీల వైపు మళ్ళకుండా ఉండేందుకు గోవా క్యాంపుకు తరలివస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో ఉన్న  ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్ లను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయం నుండి ఏసి బస్సుల్లో  గోవా క్యాంపుకు తరలిస్తున్నారు.