
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడికి పాల్పడిన 8 మందితో పాటు దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్మండల మాజీ అధ్యక్షుడు కోసూరు శ్రీనివాసరావు, వైరా మార్కెట్‌కమిటీ డైరెక్టర్రాయల పుల్లయ్య, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, రాజ్యతండా సర్పంచ్మూడ్సురేష్, తుళ్లూరి రమేశ్, గుర్రం రాజేశ్, అనంతుల సత్యనారాయణ, జమ్ముల ప్రవీణ్‌రెడ్డి ఖమ్మం నగర శివారులోని దాబాలో మద్యం తాగుతున్నారు. దాబాలో మద్యం అమ్ముతున్న సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకి వెళ్లారు. మద్యం తాగుతున్న వారి ఫోటోలు తీస్తుండగా మత్తులో ఉన్న ఆ వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రఘునాధపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.