షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలి : వై సతీష్ రెడ్డి

షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలి : వై సతీష్ రెడ్డి

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ఉద్యమకారులను, సీఎం కేసీఆర్ ను కించపరుస్తూ ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఖండించారు. షర్మిలపై వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డికి పిర్యాదు చేశారు. షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను టెర్రరిస్టులుగా పోల్చడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులుగా పోల్చిన షర్మిలకు ఎలా అపాయిట్ మెంట్ ఇస్తారని సతీష్ రెడ్డి గవర్నర్ తమిళిసైను ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ నుండి పుట్టుకొచ్చిన తోక పార్టీ వైఎస్ఆర్టీపీ అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.