టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం

టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు మీటింగ్ కు 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం, అందుకు దారితీసిన కారణాలను సీఎం నేతలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానంతో పాటు సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 

సర్వసభ్య సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.19గంటలకు పార్టీ కొత్త పేరును కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. పార్టీ కొత్త పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లనున్నట్లు సమాచారం. మీటింగ్ అనంతరం జాతీయ పార్టీ ప్రకటనతో పాటు మునుగోడు అభ్యర్థిని సైతం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.