
నల్లగొండ : నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదని కాంగ్రెస్ అభ్యర్ధిపై టీఆర్ఎస్ వర్గీయుల దాడి చేసిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల సహకార సంఘం ఎన్నికల డైరెక్టర్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 3వ వార్డు అభ్యర్థి గోధుమగడ్డ జలందర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోనందుకు టీఆర్ఎస్ వర్గీయులు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడం వల్ల అతని పరిస్థితి విషమంగా మారింది. మొదట నల్గొండ సురక్ష హాస్పిటల్ లో చేర్చిన స్థానికులు.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తరలించారు. బాధితుని స్టేట్మెంట్ తో ముగ్గురిపై అత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.