తిరుమల టూర్ లో హరీష్ ఫ్యామిలీ..

తిరుమల టూర్ లో హరీష్ ఫ్యామిలీ..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో హరీష్ రావుకు వేదాశీర్వచనం అందించారు ఆలయ పండితులు. స్వామి వారి పట్టు వస్ర్తాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు.

ఆ తర్వాత తిరుమలలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన హరీష్ ఫ్యామిలీ..పాప వినాశనం, ఆకాశగంగా, వేణు గోపాల స్వామి లాంటి ఆలయాలను దర్శించుకున్నారు.