తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ 

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ 

తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలపై చర్చించేందుకే నేతలు భేటీ అయినట్లు చెబుతున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఐటీ దాడల అంశంపై చర్చించేందుకే వారంతా సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇవాళ ఉదయం నుంచి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆఫీసులు, యూనివర్సిటీ, కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుళ్ళ నివాసాలతో పాటు  మల్లారెడ్డి తమ్ముళ్ల ఇళ్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి.