
తెలంగాణలో అతి తక్కువ రోజుల్లో రికార్డ్ ఉద్యోగాలను కల్పించడం సంతోషంగా ఉందన్నారు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి. శనివారం TRT ఇంగ్లీష్ మీడియం SGT ఫలితాలను విడుదల చేసింది TSPSC. ఈ ఫలితాల్లో 909 పోస్టులకు 843 మంది సెలక్ట్ అయినట్లు తెలిపింది. ఫలితాల విడుదల సందర్భంగా ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు TSPSC ఛైర్మన్.
అక్టోబర్ 11న 3 వేల 786 TRT-SGT తెలుగు మీడియం పోస్టులను భర్తీ చేశామని..శనివారం 843 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. 20 రోజుల్లో 5 వేల పోస్టులను భర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదో రికార్డ్ అని ట్వీట్ చేశారు చక్రపాణి.
అక్టోబరు 11 న 3786 TRT-SGT తెలుగు మీడియం టీచర్ పోస్టులు భర్తీ చేసిన TSPSC ఇవాళ 909 ఇంగ్లీషు మీడియం పోస్టుల ఎంపిక జాబితా కూడా విడుదల చేసింది. గ్రూప్2 తో కలిపి 20 రోజుల వ్యవధి లో దాదాపు 5000 పోస్టులు భర్తీ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది ఒక అరుదైన రికార్డ్. @KTRTRS @KonathamDileep
— Prof. Ghanta Chakrapani (@GhantaC) November 2, 2019