వాహనాలపై దూసుకెళ్లిన కంటైనర్.. 9 మంది మృతి

వాహనాలపై దూసుకెళ్లిన కంటైనర్.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని ధూలే జిల్లా షిర్పూర్ లో  ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఓ భారీ కంటైనర్ వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ:సిగరెట్ తాగితే చెవుడు వస్తుందా.. దానికీ దీనికి లింకేంటీ ?

జూలై 4 ఉదయం 10 గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలో ముంబై--ఆగ్రా హైవేపై ఈ  ప్రమాదం జరిగింది.  ట్రక్కు హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లే ముందు దాని వెనుక వైపున ఉన్న రెండు మోటార్‌సైకిళ్లు, ఒక కారు , మరొక ట్రక్కును ఢీకొట్టి బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. బస్టాండ్ లో కొంత మంది ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.