ట్రూ కాలర్ వాడుతున్నారా..? కొత్త ఫీచర్ వచ్చిన సంగతి తెలుసో..లేదో..

ట్రూ కాలర్ వాడుతున్నారా..? కొత్త ఫీచర్ వచ్చిన సంగతి తెలుసో..లేదో..

స్పామ్ కాల్స్, సైబర్ మోసాలను అరికట్టేందుకు ట్రూకాలర్ కొత్త ఫీచర్​ని పరిచయం చేసింది. అదేంటంటే.. స్కామ్​ ఫీడ్. ఈ ఫీచర్ డిజిటల్ సపోర్ట్ అందిస్తుంది. స్కామర్ల టార్గెట్​లపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తుంది. యూజర్లు తమకు నచ్చితే ఫీడ్​లో ఎనానిమస్​లీ పోస్ట్ చేయొచ్చు.

 థ్రెడ్ కామెంట్స్, మీడియా అప్​లోడ్స్ చేయొచ్చు. వాట్సాప్​ల్లోనూ షేర్ చేయొచ్చు. దీనిద్వారా సైబర్ మోసాలు ఎదుర్కొన్న అనుభవాలు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయాలను పంచుకోవచ్చు. ట్రూకాలర్ ఈ కొత్త స్కామ్​ఫీడ్​ను రియల్ టైమ్ స్కామ్​ అప్​డేట్స్ అందించే సోర్స్​ అని చెప్పింది.