పిల్లల పాస్‌‌‌‌పోర్ట్ కోసం..తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్ తప్పనిసరి..బర్త్ టూరిజం కట్టడికి ట్రంప్ ప్లాన్

పిల్లల పాస్‌‌‌‌పోర్ట్ కోసం..తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్ తప్పనిసరి..బర్త్ టూరిజం  కట్టడికి ట్రంప్ ప్లాన్

వాషింగ్టన్: అమెరికాలో విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వం(బర్త్‌‌‌‌రైట్ సిటిజన్‌‌‌‌షిప్) ఇచ్చే నిబంధనల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు తేవడంపై కసరత్తు చేస్తోంది. అమెరికాలో జన్మించిన తమ పిల్లల కోసం పాస్‌‌‌‌పోర్టు కోరుతూ దరఖాస్తు చేసే తల్లిదండ్రులు.. ముందుగా తమ పౌరసత్వాన్ని లేదా ఇమిగ్రేషన్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ ను రుజువు చేసే డాక్యుమెంట్లను తప్పనిసరిగా అడిగాలని యోచిస్తోంది.  

బర్త్ టూరిజాన్ని  అడ్డుకోవడానికి, జన్మతః లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయడానికి ట్రంప్ ఆగస్ట్ 6న  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌‌‌‌ జారీ చేశారు. దాన్ని అమలు చేసే దిశగా అమెరికా విదేశాంగ శాఖ ఈ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నది. ప్రస్తుత నిబంధనల ప్రకారం..  కొత్త నిబంధన అమలైతే, పిల్లల పాస్‌‌‌‌పోర్ట్ కోసం తల్లిదండ్రులు తమ పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలతో పాటు, తమ చట్టపరమైన ఇమిగ్రేషన్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ తెలిపే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. 

కాగా, ట్రంప్ హార్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన  చేశారు. ఈ మేరకు ‘ట్రూత్ సోషల్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా నియంత్రణలో ఉన్నందున దాన్ని పేరును ట్రంప్ జలసంధిగా మారిస్తే ఏలా ఉంటుంది..? అమెరికా లాగే ఇది కూడా మునుపటి కంటే మరింత హాట్‌గా మారుతుంది!” అని పేర్కొన్నారు.