ఇండియాతో చర్చలు జరపండి : పాక్‌ కు ట్రంప్‌ సూచన

ఇండియాతో చర్చలు జరపండి : పాక్‌ కు  ట్రంప్‌ సూచన

వాషింగ్టన్‌: ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. ఈ మేరకు ఇమ్రాన్​తో ట్రంప్​ఫోన్​లో మాట్లాడారు. కాశ్మీర్‌ అంశంపై యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ క్లోజ్​డోర్ మీటింగ్ తర్వాత ఈ విషయాన్ని వైట్ హౌస్ వెల్లడించింది. యూఎన్ఎస్​సీ మీటింగ్ జరగడానికి ముందే ట్రంప్.. ఇమ్రాన్​తో ఫోన్​లో మాట్లాడారు.

చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని, జమ్మూకాశ్మీర్​లో నెలకొన్న టెన్షన్లు సద్దుమణిగేలా చేయాలని ఇమ్రాన్​కు ట్రంప్ సూచించినట్లు చెప్పింది. ‘‘అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి, వాటిని ఎలా కొనసాగించాలనే దాని గురించి ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్, ఇమ్రాన్ చర్చించారు” అని వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే తెలిపారు.