సర్వే: అమెరికాలో బెస్ట్ ప్రెసిడెంట్ అబ్రహం, వేస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్

సర్వే: అమెరికాలో బెస్ట్ ప్రెసిడెంట్ అబ్రహం, వేస్ట్  ప్రెసిడెంట్ ట్రంప్

అమెరికాను ఇప్పటి వరకూ 45మంది అధ్యక్షులు పాలించారు. వారి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి 525 మంది ప్రొఫెసర్లతో ఓ సర్వే చేయించారు.  2024 ప్రెసిడెన్షియల్ గ్రేట్‌నెస్ ప్రాజెక్ట్ ఎక్స్‌పర్ట్ సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది.  ఈ  సర్వే US అధ్యక్షుల గొప్పతనం ఆధారంగా వారికి ర్యాంకులు ప్రకటించింది. ఇందులో అబ్రహం లింకన్ ఇప్పటి వరకు అగ్రదేశాన్ని రూల్ చేసిన వారిలో ది బెస్ట్ ప్రెసిడెంట్ అని ఈ సర్వేలో తేలింది. ఆయన అత్యధిక స్కోర్ 95.03 సగటుతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 

తర్వాత ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జార్జ్ వాషింగ్టన్, టెడ్డీ రూజ్‌వెల్ట్, థామస్ జెఫెర్సన్, హ్యారీ ట్రూమాన్, బరాక్ ఒబామా మరియు డ్వైట్ ఐసెన్‌హోవర్  వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ 45మందిలో ఎక్కువగా అసహించునే అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. 10.92 స్కోరుతో చెత్త పరిపాలన అందించినవాడిగా డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ లో   నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి  జో బైడన్ 14వ ప్లేస్ లో ఉన్నాడు.