వాషింగ్టన్: రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేసేందుకు అమెరికా చేసుకున్న ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు అదే దేశం నుంచి ఎలా చమురు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. అమెరికా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడమంటే ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి పుతిన్‌కు స్వయంగా నిధులు అందించడమేనని విమర్శించారు. ఈ క్రమంలో జెలెన్ స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
2022 ఫిబ్రవరిలో రష్యాతో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడంలో జెలెన్స్కీ ఘోరంగా విఫలమయ్యారని ట్రంప్ విమర్శించారు. రష్యాతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో జెలెన్స్కీ ఏ మాత్రం చొరవ చూపలేదని ఆరోపించారు. రష్యాతో యుద్ధం కారణంగా జెలెన్స్కీ ఉక్రెయిన్ 30 శాతం భూభాగాన్ని కోల్పోయారని.. ఇరు దేశాల మధ్య పది లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని.. రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు.
►ALSO READ | విదేశాల్లో తెలంగాణ మట్టి వాసన: ఘనంగా బతుకమ్మ సంబరాలు ..గల్ఫ్ దేశాల్లో సందడే సందడి..!
అసలు ఇది ప్రారంభం కాకూడని ఒక అనవసరమైన యుద్ధమని పేర్కొన్నారు. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు చేయడం వల్లే అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిందన్నారు. అమెరికాలోని రైతులు, పశుపోషకులు డీజిల్ ఇంధన ధరల పరంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేశారు.
రష్యాలోని ఇంధన మౌలిక సదుయాలపై తక్షణమే దాడులు నిలిపివేయాలని ఉక్రెయిన్ను హెచ్చరించారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీ స్థానంలో ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఉక్రెయిన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి.
