‘బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్’ తప్పదని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

‘బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్’ తప్పదని ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇరాన్ పశ్చిమాసియా లూసర్  అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌‌‌‌‌‌‌‌  ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలపై దాడికి ఇరాన్  అధ్యక్షుడు పెజెష్కియాన్  క్షమాపణ చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్  తోక ముడిచిందన్నారు. త్వరలో ఇరాన్ పై మరిన్ని భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ‘‘మా ఎటాక్స్ కు ఇరాన్ తట్టుకోలేకపోతున్నది. భీకర దాడులకు భయపడి పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పింది. 

పశ్చిమాసియాను స్వాధీనం చేసుకుని ఏలాలని ఇరాన్  భావించింది. ఇక వెస్ట్ ఏషియాకు ఇరాన్  భయం లేదు.  ఇప్పుడు ఇరాన్  ఒక లూసర్. బేషరతుగా ఇరాన్  లొంగిపోవాల్సిందే. వేరే మార్గం లేదు” అని ట్రంప్  అన్నారు. ఇరాన్  లొంగిపోయే వరకూ ఆ దేశంతో డీల్  ఉండదన్నారు. అలాగే, తన ప్రమేయం లేకుండా సుప్రీం లీడర్  నియామకం జరగరాదని కూడా వార్నింగ్  ఇచ్చారు. ఇంకా కొంత మంది కీలక అధికారులు తమ లిస్టులో ఉన్నారని,  శనివారం రాత్రి ఇరాన్ పై భీకర దాడి చేస్తామన్నారు.

రాత్రికి ఇరాన్ పై అతిపెద్ద దాడి

స్కాట్ బెసెంట్ శనివారం రాత్రి ఇరాన్​పై అతిపెద్ద దాడి చేయబోతున్నామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్​ బెసెంట్ వెల్లడించారు. అమెరికా మీడియా ఛానల్​కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెసెంట్​మాట్లాడారు. ఇరాన్​పై చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ సైన్యం సిద్ధమైందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఇరాన్​అభివృద్ధి చేస్తున్న మిసైల్​ఫ్యాక్టరీలు, లాంచర్లను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఈ దాడిని ‘బిగ్గెస్ట్​ బాంబింగ్​క్యాంపెయిన్’గా వర్ణించారు.