
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ ప్రతిష్ట మసకబారుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా అన్నారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట దాదాపు 65 లక్షల మంది దళిత, మైనార్టీల ఓట్లను అక్రమంగా తొలగించి ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. గురువారం హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్ లో సీపీఐ నగర 24వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అజీజ్ పాషా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నరేంద్ర మోదీ తీరు వల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారీఫ్‌లను 50 శాతం పెంచారని విమర్శించారు.