అందానికి ఐస్ క్యూబ్స్ మంత్రంలా పనిచేస్తాయి అంటోంది ఫేమస్ న్యూట్రిషనిస్ట్ శ్వేత షా. అందులోనూ సంత్రా ఐస్‌క్యూబ్స్ అయితే ఇంకా బెటర్ అంట. ఈ సంత్రా ఐస్ క్యూబ్స్ ఎలా తయారుచేసుకోవాలంటే..
బొప్పాయి గుజ్జుని ఫ్రిజ్‌లోని ఐస్ క్యూబ్ ట్రేలలో వేసి, గడ్డ కట్టించాలి. తర్వాత సంత్రా పండుని గుండ్రంగా తరగాలి. బంతిపువ్వు రెక్కలని కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు రెండు బొప్పాయి క్యూబ్స్‌ని, బంతిపువ్వు రెక్కలని, సంత్రా ముక్కలని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఆ గుజ్జుని ఐస్ క్యూబ్ ట్రేలో వేసి, సంత్రా ఐస్ క్యూబ్స్ తయారుచేయాలి. వాటితో రోజుకి రెండు సార్లు ముఖాన్ని మసాజ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉంటే.. ఐస్‌క్యూబ్స్‌ని పలుచటి బట్టలో చుట్టి, ముఖాన్ని రుద్దాలి.
లాభాలెన్నో..
సంత్రాలోని విటమిన్–సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలోని పపైన్ నేచురల్– డీ టానింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బంతిపువ్వులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలు తగ్గిస్తాయి. ఈ సంత్రా ఐస్ క్యూబ్ కంటి కింద నలుపుని తగ్గిస్తుంది. చర్మంపై దద్దుర్లని పోగొడుతుంది. ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తుంది.
