
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతల అరెస్ట్ ఉద్రిక్తంగా మారింది. SLBC ప్రాజెక్టు దగ్గరకు వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దేవరకొండ మాల్ దగ్గర చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ సమయంలో కోమటిరెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ… రోడ్డుపై బైఠాయించారు కోమటిరెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. SLBC ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇది ఆవిర్భావ దినోత్సవం కాదు.. బ్లాక్ డే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కృషి చేసింది కాంగ్రెస్ అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందన్నారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మేధావిలా మాట్లాడుతున్న కేసీఆర్ ఒక నియంత అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.