Big Alert.. Telangana DSC హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

Big Alert..   Telangana DSC హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

TG DSC Hall Ticket 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. డీఎస్సీ  పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు   వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.  ఓవైపు పలువురు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుండగా… షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. 

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 5వ తేదీవ తేదీతో ముగియాల్సి ఉంటుంది.డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

మొత్తం 11వేల 062 ఉద్యోగాల్లో….2 వేల 629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6 వేల 508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.  డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తం 2 లక్షల 79 వేల 956 దరఖాస్తులు వచ్చాయి.గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. 
.