TS EAMCET : జూన్ 26 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్

TS EAMCET : జూన్ 26 నుంచి  ఎంసెట్ కౌన్సిలింగ్

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్  షెడ్యూల్ ను రిలీజ్ చేశారు అధికారులు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడుతల్లో  కౌన్సిలింగ్ జరగనుంది. జూన్ 26 నుంచి  జూలై 5 వరకు  రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ ఉంటుంది. మొత్తం మూడు ఫేజ్ లలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనుంది.  

  • జూలై 8 వరకు ఫస్ట్ ఫేజ్  వెబ్ ఆప్షన్లు.. 12 న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు  
  • జూలై 21 నుంచి 24 వరకు  సెకండ్ ఫేజ్  కౌన్సిలింగ్
  • జూలై 28న   రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 2 నుంచి 4 వరకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్
  • ఆగస్టు 7న ఇంజనీరింగ్ థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు
  • ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్లు గైడ్ లైన్స్ రిలీజ్

అభ్యర్థులకు కౌన్సిలింగ్ కు  తప్పనిసరి

  • 6 తరగతి నుంచి 10 వరకు సర్టిఫికెట్లు
  • ట్రాన్స్ పర్ సర్టిఫికెట్(టీసీ)
  • టెన్త్, ఇంటర్,డిగ్రీ మెమోలు
  • రీసెంట్ ఇన్ కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఎంసెట్ హాల్ టికెట్ తో పాటు ర్యాంక్ కార్డ్