నేటి నుంచి ఎంసెట్..   నిమిషం లేటైనా నో ఎంట్రీ

నేటి నుంచి ఎంసెట్..   నిమిషం లేటైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో  బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్​కు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు 1,51,361 మంది అంటెండ్ కానుండగా.. 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ,  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగుతాయి.

ఈసారి కూడా ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో నిర్ణీత టైమ్​ కంటే కనీసం గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఎంసెట్ కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి కోరారు. ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు వెంట తెచ్చుకోవద్దని సూచించారు. ఆధార్ బెస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందన్నారు. కాగా, ఈ నెల 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ స్టూడెంట్లకు పరీక్ష జరగనున్నది. 2,05,405 మంది అంటెండ్ కానున్నారు.