
హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈనెల 18న హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో గురువారం ఆయన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ అయ్యారు. కాగా శనివారం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు.