బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతుండు : వినయ్ భాస్కర్

బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతుండు : వినయ్ భాస్కర్

బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. సంజయ్ది అహంకార యాత్ర అన్నారు. సంజయ్కు దమ్ముంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయించి..ఆ తర్వాత యాత్రలు చేయాలని సవాల్ విసిరారు. ప్రజా మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరని అన్నారు.

రాష్ట్రాభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఈడీ, ఐటీ దాడులతో కేసీఆర్ కుటుంబం సహా, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని.. నవంబర్ 29న దీక్ష దివస్ను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.