హీరో నవదీప్ కు నోటీసులు ఇచ్చి.. డ్రగ్స్ కేసులో విచారించండి : హైకోర్టు

హీరో నవదీప్ కు నోటీసులు ఇచ్చి.. డ్రగ్స్ కేసులో విచారించండి : హైకోర్టు

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలకమైన పరిణామం జరిగింది. డ్రగ్స్ కేసులో లేనని.. పోలీసుల వైఖరిని తప్పుబడుతూ.. హైకోర్టు వెళ్లిన నటుడు, హీరో నవదీప్ కు ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు రూల్స్ ఫాలో అవ్వాలని.. నటుడు నవదీప్ ను విచారించాలంటే.. ముందుగా 41(A) కింద నోటీసులు ఇచ్చి.. ఆ తర్వాత విచారించాలని పోలీసులను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు ఫాలో అవ్వాలని సూచించింది న్యాయస్థానం.

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ఉన్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. దీనిపై నవదీప్ హైకోర్టుకు వెళ్లారు. కేసుతో సంబంధం లేదని.. అరెస్టు చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రెండు వర్గాల తరపున వాదనలు విన్నది. 

ఈ సందర్భంగా పోలీసుల తరపున లాయర్ తన వాదనలు వినిపించారు. గతంలోనూ డ్రగ్స్ కేసులో నవదీప్ ఉన్నారని.. దర్యాప్తు ముందు హాజరయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ప్రయేయం ఉందని.. సాక్ష్యాలు ఉన్నాయని.. విచారించాలని కోర్టుకు వివరించారు.

Also Read :- ఈ సినిమా గుండెలను పిండేసింది.. : ఇన్ఫోసిస్ సుధా కామెంట్

ఈ వాదనలపై నవదీప్ తరపు లాయర్ కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేరని.. విచారణకు పూర్తిగా సహకరించారని.. అప్పట్లో దర్యాప్తు సంస్థలు నిందితుడిగా గుర్తించలేదని కోర్టుకు వివరించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ప్రమేయం లేదని.. పోలీసులు కావాలనే ఇరికిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.

రెండు వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. నవదీప్ ను విచారించాలంటే.. ముందుగా పోలీసులు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని.. ఆ తర్వాతే విచారించాలని ఆదేశించింది కోర్టు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ చేయాలనుకుంటే.. రూల్స్ పాటించాలంటూ పోలీసులకు సూచించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు నోటీసులు జారీ చేయటానికి సిద్ధం అయ్యారు. విచారణకు ఎప్పుడు వస్తారో చూడాలి నవదీప్.