ఈ సినిమా గుండెలను పిండేసింది.. : ఇన్ఫోసిస్ సుధా కామెంట్

ఈ సినిమా గుండెలను పిండేసింది.. : ఇన్ఫోసిస్ సుధా కామెంట్

ది కాశ్మీర్ ఫైల్స్(The kashmir files) సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek agnihotri). ఈ సంచలన దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ది వాక్సిన్ వార్(The Vaccine War). కొరోనా(Corona) సమయంలో వాక్సిన్ తయారు చేయడం కోసం సైంటిస్టులు ఎదుర్కొన్న సమస్యలు, అందుకు కోసం వారు చేసిన ప్రయత్నాలు వంటి నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న తెలుగు,తమిళ్,హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. 

ఈ క్రమంలోనే తాజాగా ది వాక్సిన్ వార్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు మేకర్స్. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు ఇన్ఫోసిస్ సుధా మూర్తి కూడా హాజరయ్యాడు. షూ అనంతరం ఆమె ది వాక్సిన్ వార్ సినిమాపై చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. సినిమా గురించి ఆమె మాట్లాడుతూ వివేక్ అగ్నిహోత్రి గుండెలను పిండేసే సినిమా తీశారు అంటూ చెప్పుకొచ్చారు.


ఇంకా ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు సుధా మూర్తి.. ప్రస్తుతం సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఒక తల్లిగా, ఒక భార్యగా, తన కెరీర్.. ఇలా చాలా విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. వాటన్నింటిని బ్యాలన్స్ చేయడం చాలా కష్టం. ఒక స్త్రీ ఇంటినుండి బయటకు వచ్చి తనకు నచ్చిన పని చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి తన కుటుంబ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను.. ప్రతీ విజయవంతమైన మహిళ వెనుక అర్థం చేసుకునే పురుషుడు ఉంటాడు అని. 

ఇంకా కరోనా సమయంలో వాక్సిన్ తయారీ గురించి మాట్లాడిన ఆమె.. సామాన్యుడికి కోవాక్సిన్ అంటే ఏమిటో అర్థం కాదు కానీ ఈ సినిమా ఆ ప్రయత్నాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం పని కాదు.. ఈ శాస్త్రవేత్తలందరూ చేసిన నిస్వార్థ పని. మనమందరం ప్రజాస్వామ్య దేశంలో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి వారు ఎక్కువ సమయాన్ని ల్యాబ్ లలో గడిపారు. వాళ్ళు పడిన కష్టం, అందుకోసం వాళ్ళు వదులుకున్న కుటుంబం వాటిన్నిటిని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అని చెప్పుకొచ్చారు సుధా మూర్తి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.