
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) జవాన్(Jawan) సినిమా విడుదలై రెండు వారాలపైనే అయినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల హవా మాత్రం తగ్గడం లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డ్స్ భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పాటికే రూ.700 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. త్వరలోనే రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ జవాన్ సినిమా సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తోంది.
ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు అట్లీ జవాన్ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్చ్ చేశారు. అట్లీ మాట్లాడుతూ.. అన్నీ సవ్యంగా జరిగితే జవాన్ సినిమా ఆస్కార్‌కి వెళ్తుంది. నిజానికి ఒక సినిమా తెరపైకి రావాలంటే.. దాని వెనుక చాలా మంది శ్రమ ఉంటుంది. సినిమాకు పనిచేసిన ప్రతీ టెక్నీషియన్స్ తమ చిత్రానికి అవార్డులు రావాలనే కోరుకుంటారు. నేను కూడా అంతే. అందుకే జవాన్ సినిమాను ఆస్కార్‌కు తీసుకెళ్లాలనే కోరిక నాకు ఉంది. దాని గురించి షారుఖ్ సర్‌తో మాట్లాడి జవాన్ సినిమాను ఆస్కార్‌కి పంపించే ప్రయత్నం చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు అట్లీ. ప్రస్తుతం అట్లీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.