దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెంకీ ఆదర్శ కుటుంబం..10 రోజులు అక్కడే

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  వెంకీ  ఆదర్శ కుటుంబం..10 రోజులు అక్కడే

వెంకటేష్  హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా, నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాన్ చేశారు. పదిరోజుల పాటు దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగనున్న షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక సన్నివేశాలతోపాటు ఓ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసేలా టీమ్ ప్లాన్ చేస్తోందట.  

ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసి, జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జులైలో సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  వెంకటేష్  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 77వ చిత్రం కాగా,   శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. నారా రోహిత్, తమిళ కమెడియన్ యోగిబాబు  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. గతంలో  వెంకటేష్ నటించిన  నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా త్రివిక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంతో పేరొచ్చింది.  దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తోన్న  ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.