అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ‘రుబరూ’ అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్, మృణాల్ టెంపుల్‌లో కూర్చొని ట్రెడిషినల్ గెటప్స్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. వీరిమధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తూ, వారి ప్రయాణాన్ని ప్రెజెంట్ చేసేలా ఈ పాట ఉండబోతోందని తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న ఈ ఆల్బమ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్-ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
