
తమిళ కమేడియన్ యోగిబాబు(Yogibabu) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేల(Mandela). మడోన్నే అశ్విన్(Madonne ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక మంగలివాడి కథే మండేలా. కామెడీగా సాగుతూనే ఎమోషన్ ను పండించిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు అవార్డ్స్ కూడా వరించాయి.
అలాంటి అవార్డు విన్నింగ్ పాత్రలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఏ ఫస్ట్ లుక్ లో సంపూర్ణేష్ బాబు ఆకట్టుకుంటున్నాడు. అక్టోబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విషయం తెల్సుకున్న ఆడియన్స్. ఇన్ని రోజులు స్పూఫ్ కామెడీతో ఆకట్టుకున్న సంపూ ఇంత సెన్సిబుల్ సినిమాను చేయగలడా? ఒక వేళ చేయలేకపోతే ఒక మంచి సినిమాను చెడగొట్టివారౌతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సంపూ ఏమేరకు మెప్పిస్తారో చూడాలి మరి.