కర్ణాటకలోని ఉడిపి దగ్గర ఉన్న శాంతాన్ టోల్ ప్లాజా సిబ్బంది తనను వేధించారంటూ వికలాంగుడైన మాజీ ఆర్మీ ఆఫీసర్ శ్యామరాజ్ ఆరోపించారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో NHAI స్పందించింది. యుద్ధంలో పాల్గొన్న సైనికులకు, వికలాంగులైన సానికులకు టోల్ చార్జీల నుంచి మినహాయింపు ఉందని... అయినప్పటికీ టోల్ సిబ్బంది తనను టోల్ ఫీజు చెల్లించాలని బలవంతం చేశారని వీడియోలో పేర్కొన్నారు శ్యామరాజ్.
ఆపరేషన్ పరాక్రమ్ లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని.. సర్టిఫికెట్స్ చూపించినప్పటికీ టోల్ సిబ్బంది తనకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని అన్నారు. నేను ఈ వీల్‌చైర్‌లో ఎందుకు కూర్చున్నాను? నా త్యాగానికి అర్థం లేదా? అంటూ ప్రశ్నిస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై స్పందించిన NHAI టోల్ ఫీజు మినహాయింపు అధికారిక విధుల్లో పనిచేస్తున్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని.. ఈ క్రమంలో బాధితుడు ఎక్స్ కమాండో కాబట్టి, పైగా అతను సమర్పించిన ప్రూఫ్స్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో మినహాయింపు వర్తించదని పేర్కొంది
