T20 World Cup 2026: వరల్డ్ కప్ నుంచి సుందర్ ఔట్..? రీప్లేస్ మెంట్‌గా ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్

T20 World Cup 2026: వరల్డ్ కప్ నుంచి సుందర్ ఔట్..? రీప్లేస్ మెంట్‌గా ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్

ఫిబ్రవరి 7 నుంచి స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ఆల్ రౌండర్  వాషింగ్టన్ సుందర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన సుందర్.. ఈ క్రమంలో వన్డే, టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. గాయం తీవ్రమైనదని తేలడంతో ఈ స్పిన్ ఆల్ రౌండర్ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండడం కష్టంగా మారింది. వరల్డ్ కప్ కు 10 రోజుల   సమయం మాత్రమే ఉండడంతో సుందర్ ఈ మెగా టోర్నీ సమయానికి ఫిట్ గా ఉండడం అనుమానంగా మారింది. తాజా సమాచార ప్రకారం సుందర్ కు మరో రెండు వారాలు రెస్ట్ కావాలని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. సుందర్ కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతున్నట్టు సమాచారం. " సుందర్  పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి మరో రెండు వారాలు అవసరం. సుందర్ వరల్డ్ కప్ లో కొనసాగుతాడా లేకపోతే అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలా అనే దానిపై సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు నిర్వహణ త్వరలో నిర్ణయం తీసుకోనుంది". అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుందర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. 

సుందర్ వరల్డ్ కప్ సమయానికి కోలుకోకుంటే అతని స్థానంలో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. స్పిన్ ఆల్ రౌండర్ కావడంతో సుందర్ ను రీప్లేస్ చేయడం కష్టంగా మారుతుంది. నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావడంతో ఈ హైదరాబాద్ ప్లేయర్ కు అవకాశాలు కష్టమే. సుందర్ ను రీప్లేస్ చేయడానికి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే రేస్ లో ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

బిష్ణోయ్ కే ఎక్కువగా ఛాన్స్:

స్వదేశంలో వరల్డ్ కప్ జరగడంతో టీమిండియాకు స్పిన్ ఆల్ రౌండర్ కంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఎక్కువగా ఉంది. పైగా సుందర్ ను రీప్లేస్ చేసే స్పిన్ ఆల్ రౌండట జట్టులో లేడు. కృనాల్ పాండ్య అంతర్జాతీయర్ క్రికెట్ ఆడి నాలుగు సంవత్సరాలు దాటింది. నేరుగా వరల్డ్ కప్ కు తీసుకొని వచ్చి ఆడించడం రిస్క్ అవుతోంది. మరోవైపు రియాన్ పరాగ్ రూపంలో స్పిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ  ఈ యువ క్రికెటర్ పూర్తి ఫిట్ నెస్ తో లేడని తెలుస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే వరల్డ్ కప్ స్క్వాడ్ లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. స్వదేశంలో స్పిన్ ట్రాక్స్ ఉండడంతో సెలక్టర్లు బిష్ణోయ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు సుందర్ న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లు పడగొట్టి తనను తాను నిరూపించుకున్నాడు. 

రియాన్ పరాగ్:

అస్సాం క్రికెటర్ రియాన్ పరాగ్ సుందర్ స్థానంలో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరాగ్ పూర్తి ఫిట్ సాధించినట్టు సమాచారం. ఒకవేళ 100 శాతం ఈ యువ క్రికెటర్ వరల్డ్ కప్ సమయానికి ఫిట్ గా ఉంటే సెలక్ట్ చేయొచ్చు. పూర్తి స్థాయి బ్యాటర్ గా రాణించడంతో బౌలింగ్ లో రెండు నుంచి మూడు ఓవర్లు బౌలింగ్ వేయగలడు. ఆరో బౌలర్ గా జట్టుకు ఉపయోగపడతాడు. 2024లో టీమిండియాలో అరంగేట్రం  చేసిన పరాగ్.. ఇప్పటివరకు తొమ్మిది టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2025 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో బాగా రాణించిన పరాగ్.. వరల్డ్ కప్ లో సుందర్ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.