ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ లో సంతోష్ రావును సిట్ విచారిస్తోంది. సిట్ విచారణకు హాజరుకాక ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంతోష్ రావు కేటీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించారు.
సంతోష్ రావు నుంచి అధికారులకు ఫోన్ వస్తే ..కేటీఆర్ చేసినట్టేనని అప్పటి అధికార వర్గాల్లో టాక్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు అధికారులతో పాటు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్ విచారించింది. సంతోష్ విచారణ తర్వాత ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకం వెనుక..
ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకంతో పాటు ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారితో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్‌ను నింపేయడంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌కు, ఎస్‌ఐబీ పోలీసులకు మధ్య సమాచారం చేరవేయడం, ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం, ఆర్థిక వ్యవహారాల మానిటరింగ్ చేయడంలో సంతోష్‌రావు ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నిందితుల స్టేట్‌మెంట్లు సహా బీ కేటీఆర్ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సంతోష్‌రావును ప్రశ్నించనున్నట్లు తెలిసింది.
